Narendra Modi: కరోనా విషయంలో నాలుగు యూరప్ దేశాలతో యూపీని పోల్చి.. యోగీని ప్రశంసించిన మోదీ!

  • కరోనాకు మందు వచ్చేంత వరకు జాగ్రత్తలు పాటించాల్సిందే
  • సామాజిక దూరం, మాస్కులు తప్పనిసరి
  • యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా గొప్పగా ఉన్నాయి
PM Modi Compares 4 European Countries With UP

కరోనా వైరస్ కు మెడిసిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు విధిగా  జాగ్రత్తలు పాటించక తప్పదని ప్రధాని మోదీ అన్నారు. సామాజిక దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడమే మన తక్షణ కర్తవ్యమని చెప్పారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని చెప్పారు. ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్ గార్ అభియాన్ ను ఈరోజు ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా యూపీలోని ఆరు జిల్లాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ... బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించి, రెండు గజాల ఎడం పాటిస్తూనే ఉండాలని చెప్పారు. నోటికి తువ్వాలును ఎలా అడ్డు పెట్టుకోవాలో ఆయన ప్రదర్శించి చూపారు.

కరోనా కట్టడి కోసం యూపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా గొప్పగా ఉన్నాయని మోదీ ప్రశంసించారు. ఇంగ్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల జనాభాతో యూపీ జనాభాను పోలుస్తూ.... ఆ దేశాల్లో 1,30,000 కరోనా మరణాలు సంభవించాయని... యూపీలో 600 మరణాలు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. ఈ నాలుగు దేశాల మొత్తం జనాభా 24 కోట్లు... యూపీ జనాభా కూడా 24 కోట్లేనని అన్నారు.

కరోనా తీవ్రత ఎలాంటిదో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గ్రహించారని... ఏమాత్రం కంగారు పడకుండా, ఫిర్యాదులు చేయకుండా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని మోదీ చెప్పారు. తన తండ్రి మరణించిన బాధను కూడా తట్టుకుని... ప్రజల కోసం యోగి పని చేశారని కితాబిచ్చారు.

More Telugu News