Actor: తెలుగు బుల్లితెర రంగంలో కరోనా అలజడి... మరో నటుడికి పాజిటివ్

Telugu serial actor get infected by corona
  • గృహలక్ష్మి సీరియల్ నటుడు హరికృష్ణకు కరోనా
  • ఇప్పటికే ప్రభాకర్ కు పాజిటివ్
  • ఇటీవలే ప్రభాకర్ ను కలిసిన హరికృష్ణ
లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఇటీవలే అన్ లాక్-1 ప్రారంభమైంది. దాంతో సినీ షూటింగులతో పాటు టీవీ సీరియళ్ల చిత్రీకరణలు కూడా మొదలయ్యాయి. ఇలా మొదలయ్యాయో లేదో అలా కరోనా వచ్చేసింది. ఇటీవలే ఓ తెలుగు సీరియల్ నటుడు ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ షూటింగ్ నిలిచిపోయింది. యూనిట్ సభ్యులను క్వారంటైన్ కు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజాగా హరికృష్ణ అనే మరో తెలుగు సీరియల్ నటుడికి కూడా కరోనా నిర్ధారణ అయింది. హరికృష్ణ ప్రస్తుతం గృహలక్ష్మి అనే సీరియల్ లో నటిస్తున్నాడు. కీలక నటుడికి కరోనా అని తేలడంతో గృహలక్ష్మి ఎపిసోడ్ షూటింగ్ నిలిపివేశారు. ఇటీవల కరోనా పాజిటివ్ గా వచ్చిన ప్రభాకర్ ను హరికృష్ణ కలిసినట్టు గుర్తించారు. ప్రభాకర్ ను కలిసిన 33 మందికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదిక రాకముందే షూటింగులు మొదలుపెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Actor
Telugu
Serial
Television
Corona Virus
Positive
Lockdown

More Telugu News