Petrol: వరుసగా 20వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol price hiked
  • పెట్రోలుపై లీటర్‌కు 21 పైసలు పెరుగుదల
  • డీజిల్‌పై 17 పైసలు పెంపు
  • హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.82.96
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు వరుసగా 20వ రోజు కూడా ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల అనంతరం ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకి రూ.80.13గా ఉండగా, డీజిల్ ధర రూ.80.19గా ఉంది.

కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ.81.82, డీజిల్ ధర రూ. 75.34, ముంబైలో పెట్రోలు ధర రూ.86.91, డీజిల్ ధర రూ.78.51, చెన్నైలో పెట్రోల్ ధర రూ.83.37, డీజిల్ ధర రూ.77.44గా ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.82.96కి చేరింది. కరోనాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రజలపై పెట్రోల్ ధరల భారం కూడా అధికమవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Petrol
India

More Telugu News