Jhanvi Kapoor: నెట్ ఫ్లిక్స్ కి జాన్వీ కపూర్ సినిమా... నిర్మాతకు భారీ లాభాలు!

  • థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ  
  • అమెజాన్ లో అమితాబ్ నటించిన 'గులాబో సితాబో'
  • జాన్వీ నటించిన 'గుంజన్ సక్సేనా'కి 70 కోట్ల ఆఫర్
Jhanvi Kapoor starrer Gunjan Saksena to be released through OTT

సినిమాల ప్రదర్శన విషయంలో ఓటీటీ ప్లాట్ ఫాం థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ సవాల్ విసురుతోంది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లేయర్స్ భారీ రేటుని ఆఫర్ చేస్తూ పలు సినిమాల ప్రదర్శన హక్కులను చేజిక్కించుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడడంతో ఓటీటీకి మరింత ప్రాధాన్యం పెరిగింది. పలువురు నిర్మాతలు థియేటర్ల కోసం ఎదురుచూడకుండా వీటితో డీల్ కుదుర్చుకుంటున్నారు.

పైగా నిర్మాతలకు ఇది టెన్షన్ ఫ్రీ. సినిమా జయాపజయాలతో పనిలేదు. ముందుగానే భారీ లాభాలు కళ్లజూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాతలు పలువురు అటువైపు దృష్టి సారిస్తున్నారు. ఇటీవలే అమితాబ్ నటించిన 'గులాబో సితాబో' చిత్రాన్ని అలాగే మంచి లాభాలకు అమెజాన్ కి అమ్మడం, అది విడుదల కావడం కూడా జరిగిపోయింది.

ఇదే కోవలో కరణ్ జొహార్ నిర్మించిన 'గుంజన్ సక్సేనా.. ది కార్గిల్ గాళ్' కూడా ఓటీటీ ద్వారా త్వరలో విడుదల కానుంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రానికి 70 కోట్లను ఆఫర్ చేసి నెట్ ఫ్లిక్స్ సంస్థ విడుదల హక్కులను సొంతం చేసుకున్నట్టు బాలీవుడ్ సమాచారం. 30 కోట్ల బడ్జెట్టుతో తీసిన ఈ చిత్రానికి ఇంతటి రేటు రావడం విశేషమనే చెప్పాలి. దీంతో పలువురు నిర్మాతలు ఈ ఓటీటీ ప్లాట్ ఫాంకు బాగా ఆకర్షితులవుతున్నారు.               

More Telugu News