తీరు మార్చుకోని పాక్.. షాకిచ్చిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్!
- నిన్న సమావేశమైన ఎఫ్ఏటీఎఫ్
- ఉగ్ర సంస్థలకు నిధులు చేకూరుతున్న మార్గాలను అన్వేషించడంలో విఫలం
- అక్టోబరు నాటికి మారకుంటే బ్లాక్ లిస్టులోకి పాక్
ఉగ్రవాదుల విషయంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ పాక్ తీరు మార్చుకోకపోవడంతో ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు షియాంగ్‌మిన్ లియూ (చైనా) నేతృత్వంలోని బృందం ఈ నిర్ణయం తీసుకుంది. 2018 నుంచి ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులోనే కొనసాగుతున్న పాకిస్థాన్ ఈ ఏడాది అక్టోబరులో జరిగే సమావేశం నాటికి తన పంథాను మార్చుకోనట్టయితే ఇరాన్, ఉత్తర కొరియాలానే ‘బ్లాక్ లిస్టు’లోకి చేరుతుంది.