Hyderabad: నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న: వైసీపీ నేత పీవీపీ

PVP Tweet Goes Viral
  • హైదరాబాద్ లో పీవీపీపై కేసు
  • నేడు విచారణకు హాజరు కావాల్సిన పీవీపీ
  • ఆసక్తికర ట్వీట్ చేసిన వైసీపీ నేత
హైదరాబాద్ లో తనపై నమోదైన కేసు విషయంలో నేడు విచారణకు హాజరుకావాల్సివున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్లూరి వర ప్రసాద్, ఈ ఉదయం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. "తప్పుని తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు. నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న" అని ఆయన అన్నారు. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసుంటారన్న చర్చ ఇప్పుడు మొదలైంది.

కాగా, పీవీపీపై బంజారాహిల్స్ పోలీసులు కేసును రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్ కైలాశ్ అనే వ్యక్తి ఫిర్యాదుపై దీనిని నమోదు చేశారు. తాను ఇంటి నిర్మాణాన్ని మార్చుకుంటుంటే, పీవీపీ, తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారన్నది ఆయన ఆరోపణ, దీనిపై పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి, బుధవారం కొంతసేపు ప్రశ్నించారు. తిరిగి గురువారం ఉదయం రావాలని ఆదేశించారు.
Hyderabad
PVP
Twitter

More Telugu News