Rammohan Naidu: పిన్న వయసులోనే అరుదైన ఘనతను సాధించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • సంసద్ రత్న 2020 అవార్డుకు ఎంపిక
  • చిన్న వయసులో ఈ ఘనతను సాధించిన ఎంపీగా రామ్మోహన్ రికార్డు
  • టీడీపీ శ్రేణులకు అంకితమన్న రామ్మోహన్
Ram Mohan Naidu becomes youngest MP to get Sansad Ratna Award 2020

యువ నాయకుడు, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అరుదైన ఘనతను సాధించారు. పార్లమెంటేరియన్ల పనితీరు ఆధారంగా ఇచ్చే సంసద్ రత్న అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. మంచి పనితీరును కనపరిచే పార్లమెంటు సభ్యుడికి ఈ అవార్డును ఇస్తారు. ఈ అవార్డుకు ఎంపిక కావడమే కావడమే కాకుండా... అతి పిన్న వయసులోనే ఈ ఘనతను సాధించిన ఎంపీగా రామ్మోహన్ నాయుడు రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులకు, కింజరపు అభిమానులకు అవార్డును అంకితమిస్తున్నట్టు తెలిపారు.

2010 నుంచి సంసద్ రత్న అవార్డులను ప్రకటిస్తున్నారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సూచనతో ఈ అవార్డులను ఇస్తున్నారు. ఈ ఏడాదికి 10 మంది ఎంపీలను ఎంపిక చేయగా... వారిలో ఎనిమిది మంది లోక్ సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు.

సంసద్ రత్న అవార్డులకు ఎంపికైన వారి జాబితా:

లోక్ సభ సభ్యులు:
రామ్మోహన్ నాయుడు (టీడీపీ-ఏపీ), శశిథరూర్ (కాంగ్రెస్-కేరళ), నిషికాంత్ దూబే (బీజేపీ-ఝార్ఖండ్), సుభాష్ రామ్ రావ్ భమ్రే (బీజేపీ-మహారాష్ట్ర), అజయ్ మిశ్రా (బీజేపీ-ఉత్తరప్రదేశ్), హీనా గవిట్ (బీజేపీ-మహారాష్ట్ర), సుప్రియా సూలే (ఎన్సీపీ-మహారాష్ట్ర), అమోల్ రామ్ సింగ్ కోలే (ఎన్సీపీ-మహారాష్ట్ర).

రాజ్యసభ సభ్యులు:
ఛాయా వర్మ (కాంగ్రెస్-ఛత్తీస్ గఢ్), విశంబర్ ప్రసాద్ నిషద్ (సమాజ్ వాదీ పార్టీ-ఉత్తరప్రదేశ్)లతో పాటు పీసీ గద్ది గౌడర్ (వ్యవసాయ కమిటీ చైర్మన్)  ఉన్నారు.

More Telugu News