Veena: పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటిన అవిభక్త కవలలు వీణ, వాణి!

Veena and Vani scores more than 9 GPA in 10th exams
  • 9 శాతానికి పైగా జీపీఏ సాధించిన వైనం
  • వేర్వేరు హాల్ టికెట్లతో పరీక్షలు రాసిన అవిభక్త కవలలు
  • ఇంటర్ లో ఎంఈసీ చదవాలనుకుంటున్న వీణ, వాణి
అవిభక్త కవలలు వీణ, వాణిలు పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటారు. మార్చి నెలలో జరిగిన మూడు పరీక్షలకు వీరు హాజరయ్యారు. హైదరాబాద్ మధురానగర్ లోని ప్రతిభ హైస్కూల్ లో వేర్వేరు హాల్ టికెట్లతో వారు పరీక్షలు రాశారు. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. విద్యార్థులు అందరూ పాస్ అయినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన గ్రేడింగ్ లో వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 జీపీఏ సాధించారు. పరీక్షల సమయంలో వీరిద్దరినీ ప్రత్యేక వాహనంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. మరోవైపు ఇంటర్ లో ఎంఈసీ కోర్సులో చేరేందుకు ఇద్దరూ ఆసక్తిని కనబరుస్తున్నారు.
Veena
Vani
10th Exams

More Telugu News