Corona Virus: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. చిన్నారులపై కరోనా ప్రభావం తక్కువేనట!

  • సర్వే నిర్వహించిన ఫ్రాన్స్ కు చెందిన పాశ్చర్ ఇన్స్టిట్యూట్
  • 1,340 మందిపై సర్వే నిర్వహించిన శాస్త్రవేత్తలు
  • సర్వేలో పాల్గొన్న వారిలో 510 మంది విద్యార్థులు
Effect of corona virus is less on children reveals a survey

కరోనా రక్కసికి ప్రపంచ వ్యాప్తంగా జనాలు హడలిపోతున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎవరికి వారు పలు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ఈ వైరస్ చిన్నారులు, ఎక్కువ వయసు వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని... వీరి పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో ఫ్రాన్స్ కు చెందిన పాశ్చర్ ఇన్స్టిట్యూట్ ఏయే వయసుల వారిపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతోందనే అంశంపై ఓ సర్వేను నిర్వహించింది. చిన్నారులపై కరోనా వైరస్ ప్రభావం తక్కువేననే విషయం ఈ సర్వేలో తేలింది.

ప్యారిస్ లో 1,340 మందిపై పాశ్చర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సర్వే నిర్వహించారు. వీరిలో 510 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. 61 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కరోనా సోకినట్టు వెల్లడైంది. కరోనా ప్రభావం చిన్నారులపై తక్కువగానే ఉందని తేలింది. పెద్దల నుంచే కరోనా ఎక్కువగా విస్తరిస్తోందని వెల్లడైంది.

More Telugu News