Neha Gowda: బిడ్డకు జన్మనిచ్చాననే వార్తలు చూసి కృంగిపోయాను: కన్నడ నటి నేహ గౌడ్

Actress Neha Gowda condemns news of her motherhood
  • ఇలాంటి వార్తలు రాసేవారు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదు
  • అలాంటి వారు ఏదో ఒక రోజు మనోవేదనకు గురవుతారు
  • వార్త రాసేముందు ఒకసారి నిర్ధారించుకుంటే బాగుంటుంది
కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ-3 ఫేమ్ నేహ గౌడ్ ఓ బిడ్డకు జన్మనిచ్చిందనే వార్తలు మీడియాలో ప్రసారమయ్యాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చిందని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె మండిపడ్డారు. తనపై ఇలాంటి అసత్యపు వార్తలు రావడం దురదృష్టకరమని ఆమె అన్నారు. ఈ వార్తలతో తాను కృంగిపోయానని చెప్పారు. ఇలాంటి వార్తలు రాసేవారు ఏం సాధిస్తారో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి అసత్యపు వార్తలు రాసేవారు ఏదో ఒక రోజు మనోవేదనకు గురవుతారని అన్నారు.

ఓ వార్త రాసేటప్పుడు ఎవరి గురించి రాస్తున్నారో వారిని ఒకసారి అడిగితే బాగుంటుందని నేహ గౌడ అన్నారు. తన గురించి వార్త రాసేటప్పుడు తననో, తన కుటుంబసభ్యులనో అడిగితే బాగుండేదని చెప్పారు. ఇలాంటి వార్తలు రాసేముందు మీకు కూడా ఓ అమ్మ, ఓ అక్క, ఓ స్నేహితురాలు ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

నటనారంగంలోకి రాకముందు నేహ ఎయిర్ హోస్టెస్ గా పని చేశారు. పలు కన్నడ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గుర్తింపును తెచ్చుకున్నారు. కన్నడతో పాటు తమిళం, మలయాళం, తెలుగులో కూడా ఆమె నటించారు.
Neha Gowda
Actress
Kannada
Baby

More Telugu News