Mahesh Babu: థ్యాంక్యూ సూపర్ స్టార్‌ మహేశ్ బాబు: సినీనటి విజయశాంతి

mahesh babu wishes vijayashanti
  • నేడు విజయశాంతి పుట్టినరోజు
  • శుభాకాంక్షలు తెలిపిన మహేశ్
  • ఎల్లప్పుడు పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగా జీవించాలని వ్యాఖ్య
సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజ‌య‌శాంతి ఈ రోజు జన్మదిన వేడుక జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీనటుడు మహేశ్ బాబు ఆమెకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు విజయశాంతి గారు. మీరు ఎల్లప్పుడు పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను' అని సినీనటుడు మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. దీనికి ఆమె 'థ్యాంక్యూ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారు' అంటూ రిప్లై ఇచ్చారు.

కాగా, విజయశాంతికి పలువురు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు. మీరు నటించే సినిమాలకు మీరే ఓ గొప్ప సంపదలా కనపడతారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు మీరందించిన సహకారాన్ని వివరించడానికి పదాలు సరిపోవు' అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు.
Mahesh Babu
Tollywood
vijaya shanti
anil ravipudi

More Telugu News