sushanth singh: సుశాంత్‌ సింగ్ పెంపుడు కుక్క కూడా మృతి చెందిందని వార్తలు.. స్పష్టతనిచ్చిన కుటుంబ సభ్యులు

  • ఆ శునకం ఏమైందన్న విషయంపై నెటిజన్ల చర్చ
  • సుశాంత్‌ మృతి చెందినప్పటి నుంచి ఆహారం తినలేదని పోస్టులు
  • ఆ కుక్క మృతి చెందలేదన్న సుశాంత్ కుటుంబ సభ్యులు
  • సుశాంత్‌ ఇంట్లోనే ఆరోగ్యంగా ఉందని స్పష్టత
sushant family give clarity on dog

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన గతంలో తన  పెంపుడు కుక్కతో తరుచూ ఫొటోలు తీసుకుని వాటిని పోస్ట్ చేస్తుండేవాడు. ఆయన మరణంతో ఆ శునకం ఏమైందన్న విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆ కుక్క పేరు ఫడ్జ్ అని, సుశాంత్‌కు అదంటే చాలా ఇష్టమని చెబుతున్నారు.‌

 సుశాంత్‌ ఫొటోని చూస్తూ ఆ కుక్క కన్నీరు పెట్టుకున్న ఫొటోలు ఇటీవల బయటకు వచ్చాయి. వాటిని రీపోస్ట్ చేస్తోన్న నెటిజన్లు ఇప్పుడు ఆ కుక్క ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఆ కుక్క కూడా మృతి చెందిందని   వార్తలు కూడా వస్తున్నాయి. సుశాంత్‌ మృతి చెందినప్పటి నుంచి అది ఎలాంటి ఆహారం తినలేదని కొందరు పోస్టులు చేస్తున్నారు. దీనిపై చివరకు సుశాంత్ కుటుంబ సభ్యులు స్పందించాల్సి వచ్చింది. ఆ కుక్క మృతి చెందలేదని, సుశాంత్‌ ఇంట్లోనే ఆరోగ్యంగా ఉందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News