Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. చెరువులో మునిగి ఐదుగురు బాలికల మృతి

5 girls drown in lake in Maharashtra
  • భోకార్డన్ సమీపంలోని తలేగావ్ వాడీలో ఘటన
  • బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులు
  • మృతులందరూ ఏడేళ్ల లోపువారే
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఘోరం జరిగింది. భోకార్డన్ సమీపంలోని తలేగావ్‌వాడీకి చెందిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన ఐదుగురు చిన్నారులు చెరువు పూడికలో చిక్కుకుపోయారు. అటువైపుగా వెళ్తున్నవారు గమనించి బాలికలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలికలు ఐదుగురూ మరణించినట్టు ఫూలంబ్రీ పీహెచ్‌సీ అధికారులు తెలిపారు. మృతులందరూ ఐదు నుంచి ఏడేళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Maharashtra
lake
drown
girls

More Telugu News