Actor: తెలుగు టీవీ సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్... షూటింగ్ నిలిపివేత

  • తిరుపతి నుంచి నేరుగా షూటింగ్ కు వచ్చిన నటుడు
  • యూనిట్ సభ్యులందరికీ క్వారంటైన్
  • నటుడు ఎవర్ని కలిశాడన్న దానిపై పోలీసుల ఆరా
Telugu tv serial actor tested corona positive

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇటీవలే సినీ, టీవీ షూటింగులు పునఃప్రారంభమయ్యాయి. భౌతికదూరం పాటించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలు సినీ, టీవీ పరిశ్రమలకు స్పష్టం చేశాయి. కానీ, ఓ తెలుగు టీవీ సీరియల్ యూనిట్లో కరోనా కలకలం రేగింది. సీరియల్లో నటిస్తున్న ఓ నటుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ ధారావాహిక షూటింగ్ నిలిపివేశారు. యూనిట్ సభ్యులను క్వారంటైన్ కు పంపారు. కాగా, ఈ తెలుగు టీవీ సీరియల్ ప్రముఖ చానల్లో ప్రసారమవుతోంది.

కరోనా సోకిన నటుడు తిరుపతి నుంచి నేరుగా షూటింగ్ కు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ నటుడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత షూటింగులు ప్రారంభమయ్యాయన్న ఆనందంలో ఉన్న బుల్లితెర నటీనటులు ఈ పరిణామంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఈ ఘటన మిగతా టీవీ సీరియళ్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More Telugu News