Hyderabad: కరోనాతో విలవిల్లాడుతున్న హైదరాబాద్... 24 గంటల్లో 652 మందికి కరోనా పాజిటివ్

Hyderabad city suffers with corona virus
  • తెలంగాణలో కొత్తగా 879 మందికి కరోనా
  • 219 మంది డిశ్చార్జి
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • 220కి పెరిగిన మరణాలు
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా భూతం కోరలు చాచి విజృంభిస్తోంది. తాజాగా 652 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అంతకంతకు కరోనా తీవ్రత పెరుగుతుండడం ప్రభుత్వాన్ని, అధికార వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రం మొత్తమ్మీద 879 మందికి కరోనా నిర్ధారణ అయింది. వాటిలో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తమ్మీద రాష్ట్రంలో ఇప్పటివరకు 9,553 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 219 మందిని డిశ్చార్జి చేశారు. దాంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,224కి చేరింది. ప్రస్తుతం 5,109 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కరోనాతో ముగ్గురు మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 220కి పెరిగింది.
Hyderabad
GHMC
Telangana
Corona Virus
Positive
COVID-19

More Telugu News