CERT: ఈ పేరుతో మెయిల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దు: కేంద్రం

  • ప్రమాదకర మెయిళ్లపై కేంద్రం హెచ్చరికలు
  • హానికర మెయిళ్లపై క్లిక్ చేస్తే కష్టాల్లో చిక్కుకుంటారని వెల్లడి
  • ఆర్థికపరమైన సమాచారం హ్యాకర్లకు వెళుతుందని వివరణ
CERT warns people on fishing mails

హానికరమైన మెయిళ్ల విషయంలో కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. కరోనా పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారంటూ ఈ-మెయిల్ వస్తే దానిపై ఎంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ అనుబంధ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్) స్పష్టం చేసింది. ముఖ్యంగా, ncov2019@gov.in పేరుతో ఈ-మెయిల్ వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని తెల్చి చెప్పింది. ఆ మెయిల్ పై క్లిక్ చేస్తే కోరి కష్టాలను కొనితెచ్చుకున్నట్టేనని వెల్లడించింది. వ్యక్తిగత సమాచారంతో పాటు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రహస్య సమాచారం అంతా హ్యాకర్ల చేతికి చిక్కుతుందని సెర్ట్ నిపుణులు తెలిపారు. సైబర్ మోసగాళ్లు ప్రమాదకర మాల్వేర్లు, వైరస్ లను ఇలాంటి మోసపూరిత ఈ-మెయిల్స్ ద్వారా పంపిస్తుంటారని, యూజర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

More Telugu News