Ganta Srinivasa Rao: గంటాను అనుమతించని సీఐడీ అధికారులు.. ఏదైనా ఉంటే తనను అరెస్ట్ చేయాలన్న టీడీపీ నేత!

  • సోషల్ మీడియాలో మెసేజ్ ఫార్వర్డ్ చేసిన గంటా సన్నిహితుడు కిషోర్
  • తెల్లవారుజామున అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
  • కిషోర్ దేశ ద్రోహానికి పాల్పడలేదన్న గంటా
Ganta Srinivasa Rao fires on CID officers

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. సీఐడీ అదుపులో ఉన్న తన సన్నిహితుడు నలంద కిషోర్ ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయనను కార్యాలయంలోకి సీఐడీ అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులపై గంటా మండిపడ్డారు.

కిషోర్ వ్యవహారంలో సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయన విమర్శించారు. కిషోర్ దేశ ద్రోహానికి పాల్పడలేదని, దేశ రక్షణ అంశాలను లీక్ చేయలేదని... సోషల్ మీడియాలో తనకు వచ్చిన ఒక మెసేజ్ ను ఫార్వర్డ్ చేశాడని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నో మెసేజ్ లను షేర్ చేస్తుంటారని... పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేయాల్సినంత తీవ్రమైన కేసు ఇది కాదని దుయ్యబట్టారు. రాజకీయపరంగా ఏదైనా ఉంటే తనను అరెస్ట్ చేయాలని... తన సన్నిహితులను కాదని చెప్పారు. ఈ తెల్లవారుజామున కిషోర్ ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను విశాఖలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు.

More Telugu News