Nimmagadda Ramesh: పార్క్‌ హ‌య‌త్ హోట‌ల్‌లో.. సుజ‌నా చౌద‌రి, కామినేని శ్రీ‌నివాస్‌, నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ ర‌హ‌స్య భేటీ.. వీడియో ఫుటేజి వైరల్!

Nimmagadda Ramesh Sujana Chowdary and Kamineni srinivas meeting video goes viral
  • ఈనెల 13న జరిగిన భేటీ
  • వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన వైసీపీ 
  • చర్చనీయాంశం అయిన సమావేశం
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లోని ఒక రూంలో రహస్యంగా భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఫుటేజీని వైసీపీ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

ఈనెల 13న వీరు సమావేశమైనట్టు వీడియో ఫుటేజి ద్వారా తెలుస్తోంది. ఓవైపు ఎస్ఈసీకి సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతున్న సమయంలో... ఈ భేటీ జరగడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, కావాలనే ఎవరో ఈ ఫుటేజ్ ని లీక్ చేశారని కొందరు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ మీటింగ్ అంశం రాజకీయంగా దుమారం రేపే అవకాశాలున్నాయి.
Nimmagadda Ramesh
Sujana Chowdary
Kamineni Srinivas
bjp
Meeting

More Telugu News