Letter With blood: చైనాతో యుద్ధానికి పంపాలంటూ, రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన హోమ్ గార్డ్!

  • సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతలు
  • రాయచూరు సమీపంలో హోమ్ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మణ్
  • యుద్ధం వస్తే ముందుంటానని వెల్లడి
Home Guard Letter with Blood to President of India

ఇండియా, చైనాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండగా, ఇరు పక్షాలూ అదనపు సైన్యాలను తరలిస్తున్న వేళ, తనకు యుద్ధంలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ, ఓ హోమ్ గార్డు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో ఓ లేఖ రాశాడు.

 కర్ణాటకలోని రాయచూరు జిల్లా మస్కి ప్రాంతానికి చెందిన మడివాళ లక్ష్మణ్, హోమ్ గార్డుగా పనిచేస్తూ, పలు ఇతర వ్యాపకాల్లోనూ నిమగ్నుడై ఉన్నాడు. విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, వ్యాకరణ బోధన చేయడంతో పాటు గ్రామంలోని పిల్లలకు దేశభక్తిని గురించి వివరిస్తూ, వారిలో క్రీడా మనోభావాలను పెంచుతున్నాడు. మ్యాథ్స్, సైన్స్ టీచర్ గానూ పనిచేస్తున్నాడు.

ఒకవేళ ఇండియా, చైనాల మధ్య యుద్ధం వస్తే, దేశ రక్షణకు తాను ముందుండాలని భావించానని, అందుకే యుద్ధంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని లేఖను రాశానని వెల్లడించిన లక్ష్మణ్, వైద్యుల సలహాలు తీసుకుని, తన రక్తంతోనే దీన్ని రాశానని చెప్పడం గమనార్హం.

More Telugu News