VK Saraswat: సైనికులకు చైనా తయారీ బుల్లెట్ ప్రూఫ్ సూట్లు ఎందుకు?: నీతి ఆయోగ్ సభ్యుడి ప్రశ్న

  • 2017లోనే ఆర్డరిచ్చిన భారత్
  • అతి త్వరలోనే రానున్న జాకెట్లు
  • మరోసారి ఆలోచించాలన్న వీకే సారస్వత్
Niti Aayog Says Rethink on the Bulltet Proof Jacket Contract to China

సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఇండియా, చైనాల మధ్య రక్తం చిందిన తరుణంలో చైనావారు తయారు చేసిన రక్షణ సూట్లు ఎందుకంటూ నీతి ఆయోగ్ సభ్యుడు ప్రశ్నించారు. ఇప్పటికే భారత రక్షణ శాఖ రెండు లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను చైనా సంస్థకు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రక్షణ దళాలకు ఉన్న తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, లేహ్ సహా పలు సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో విధులను నిర్వహించే వారికి వీటిని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 2017లో ఇందుకు సంబంధించిన డీల్ కుదరగా, అతి త్వరలోనే 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇండియాకు రానున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అందించే రక్షణ కిట్ల కాంట్రాక్టు విషయంలో మరోసారి ఆలోచించాలని నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) మాజీ చీఫ్ వీకే సారస్వత్ కోరారని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

More Telugu News