AP High Court: హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా భానుమతి.. తొలి మహిళగా రికార్డు

  • హైకోర్టు విభజన తర్వాత తొలి రిజిస్ట్రార్‌గా పనిచేసిన మానవేంద్రనాథ్
  • ప్రస్తుతం విశాఖ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న భానుమతి
  • 30లోపు బాధ్యతల స్వీకరణ
BS Bhanumathi appinted as AP High Court registrar

విశాఖపట్టణం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి బీఎస్ భానుమతి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ)గా నియమితులై రికార్డులకెక్కారు. ఈ నెల 30లోపు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్‌జీగా ఓ మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. హైకోర్టు విభజన తర్వాత చీకటి మానవేంద్రనాథ్ హైకోర్టు తొలి రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేశారు.

అయితే, ఆరు నెలల తర్వాత ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఐటీ కమ్ సెంట్రల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రిజిస్ట్రార్ అయిన బి.రాజశేఖర్ ఇప్పటి వరకు రిజిస్ట్రార్ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. ఇప్పుడా స్థానంలో బీఎస్ భానుమతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

More Telugu News