GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ స్వైరవిహారం... ఒక్కరోజులో 713 కేసులు

GHMC suffers with huge number of corona cases
  • రంగారెడ్డి జిల్లాలో మరో 107 మందికి కరోనా
  • తెలంగాణలో 24 గంటల్లో 872 కొత్త కేసులు
  • మరో ఏడుగురి మృతి
  • 217కి చేరిన కరోనా మరణాలు
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ మరింత తీవ్రమైంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 713 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అటు రంగారెడ్డి జిల్లాలోనూ ఇవాళ 107 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.

ఇక, తెలంగాణ వ్యాప్తంగా 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 8,674కి పెరిగింది. తాజాగా 274 మంది డిశ్చార్జి అయ్యారు. ఓవరాల్ గా 4,005 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 4,452 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరో 7 గురు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 217కి చేరింది.
GHMC
Corona Virus
Hyderabad
Telangana
Positive
Deaths
COVID-19

More Telugu News