Corona Virus: కరోనాకు మందును విడుదల చేస్తున్న ఫార్మా కంపెనీ సిప్లా

Cipla announces corona virus treatment drug
  • మందును తీసుకొస్తున్నట్టు ఇప్పటికే  ప్రకటించిన గ్లెన్ మార్క్, హెటిరో
  • 'సిప్రెమి' పేరుతో మందును తీసుకొస్తున్నట్టు తెలిపిన సిప్లా
  • అత్యవసర పరిస్థితుల్లో వాడొచ్చని ప్రకటన
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఫాబిఫ్లూ పేరుతో గ్లెన్ మార్క్, కోవిఫర్ పేరుతో హెటిరో డ్రగ్స్ కంపెనీలు మెడిసిన్ తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి మందును మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. 'సిప్రెమి' పేరుతో మెడిసిన్ ను విడుదల చేస్తున్నట్టు తెలిపింది.

యాంటీ వైరల్ డ్రగ్ రెమిడీసివిర్ కు జనరిక్ వర్షన్ గా ఈ మందును తెస్తున్నట్టు సిప్లా పేర్కొంది. కరోనా బారిన పడిన వారికి అత్యవసర పరిస్థితుల్లో ఈ మందును వాడితే ప్రయోజనం ఉంటుందని చెప్పింది. త్వరలోనే దీని ధరను వెల్లడించనున్నట్టు తెలిపింది.
Corona Virus
Sipla
Drug

More Telugu News