India: మా కమాండింగ్ ఆఫీసర్ కూడా చనిపోయాడు: వారం తర్వాత ఒప్పుకున్న చైనా

  • రెండు దేశాల మధ్య ఘర్షణలో 20 మంది భారత సైనికుల వీర మరణం
  • చైనా వైపు కూడా పెద్ద సంఖ్యలో మరణాలు
  • మరణాల సంఖ్యను దాస్తున్న చైనా
China accepts that they have lost a commanding officer in rift with India

లడఖ్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న గాల్వన్ లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మన దేశానికి చెందిన 20 మంది వీర మరణం పొందారు. వీరిలో కల్నల్ ర్యాంకులో ఉన్న తెలుగు అధికారి సంతోష్ బాబు కూడా ఉన్నారు. మరోవైపు  ఇదే ఘర్షణలో చైనా కూడా పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయింది. దాదాపు 45 మంది వరకు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై చైనా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎప్పటి మాదిరే సైనికుల మరణాల సంఖ్యను దాచింది.

అయితే, ఈ ఘర్షణ జరిగిన వారం తర్వాత చైనా ఎట్టకేలకు దీనిపై స్పందించింది. ఘర్షణలో తమ కమాండింగ్ ఆఫీసర్ కూడా చనిపోయారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య గత వారం జరిగిన మిలిటరీ అధికారుల స్థాయి చర్చల్లో చైనా అధికారులు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్టు ఆర్మీ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే, మొత్తం ఎంత మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని మాత్రం చైనా ప్రకటించలేదు.

More Telugu News