Chandrababu: బాలకృష్ణ తిరుగులేని అంకితభావంతో తండ్రి ఆశయాలను నెరవేర్చుతున్నారు: చంద్రబాబు

Chandrababu praises Balakrishna on Basavatarakam Cancer Hospital completion of twenty years
  • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 20 ఏళ్లు
  • బాలయ్యను అభినందించిన చంద్రబాబు
  • భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సేవలు అందించాలంటూ ట్వీట్
హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. బసవతారకం ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణను ఈ సందర్భంగా అభినందించారు. గత 20 ఏళ్లుగా పేదలకు సేవలు అందిస్తున్నారంటూ ఆసుపత్రి వర్గాలను ప్రశంసించారు.

బాలకృష్ణ తన తండ్రి దివంగత ఎన్టీ రామారావు ఆశయాలను తిరుగులేని అంకితభావంతో నెరవేర్చుతున్నారని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవలు అందించాలని, ప్రతి అంశంలోనూ వారికి శుభం జరగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అంతేకాదు, 2000 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి హైదరాబాదులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న ఫొటోను కూడా చంద్రబాబు పంచుకున్నారు.
Chandrababu
Balakrishna
Basavatarakam Cancer Hospital
20 Years
Hyderabad

More Telugu News