గవర్నర్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ

22-06-2020 Mon 17:30
  • గవర్నర్ తో సీఎం మర్యాదపూర్వక భేటీ
  • గవర్నర్ ప్రసంగంపై సీఎం జగన్ ధన్యవాదాలు
  • సమావేశాల తీరుతెన్నులపై చర్చ
CM Jagan meets AP Governor

ఏపీ సీఎం జగన్ ఇవాళ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమయ్యారు. ఏపీ చట్టసభల్లో బడ్జెట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సీఎం జగన్ గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం సాగడంతో ఆయనతో సీఎం జగన్ నేరుగా కలవడం వీలు కాలేదు. దాంతో ఇప్పుడు కలిసి ధన్యవాదాలు తెలిపారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం సాగింది. సీఎం జగన్ గవర్నర్ తో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, మండలిలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులపైనా సీఎం జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది.