Mopidevi Venkataramana: కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా: మోపిదేవి వెంకటరమణ

I will try to bring more funds from center says Mopidevi Venkataramana
  • గుంటూరు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశా
  • పార్టీ కోసం పని చేస్తున్న వారికి జగన్ తగు ప్రాధాన్యతను ఇస్తున్నారు
  • కుల రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు
రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు రాజకీయపరంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం తాను శాయశక్తులా కృషి చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని కులాల అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. తనపై నమ్మకంతో రాజ్యసభకు పంపిస్తున్నారని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి అధిక నిధులను తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

ఇతర పార్టీలలో ఏ పార్టీలోనూ పార్టీ కోసం పని చేస్తున్న వారికి సరైన ప్రాధాన్యత లభించడం లేదని... పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి జగన్ మాత్రం తగు ప్రాధాన్యతను ఇస్తున్నారని మోపిదేవి అన్నారు. రిజర్వేషన్ గల కులాలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతాన్ని కేటాయించిన ఘనత జగన్ కే చెల్లిందని కితాబిచ్చారు. కుల రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటని... అవసరాలకు కులాలను వాడుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు.
Mopidevi Venkataramana
YSRCP
Jagan
Chandrababu
Telugudesam

More Telugu News