ritu varma: లవ్ మేరేజ్ అంటే ఇష్టం: హీరోయిన్ రీతు వర్మ

ritu interests in love marriage
  • నాకు పెళ్లి చేసేయాలని చూస్తున్నారు
  • కాస్త స‌మయం కావాల‌ని అడిగాను
  • నాకు నచ్చిన వ్య‌క్తి దొరికిన‌ప్పుడు చేసుకుంటా
తాను ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుగు హీరోయిన్‌ రీతూ వర్మ చెప్పింది. ప్రస్తుతం ఈ భామ 'ట‌క్ జ‌గ‌దీశ్'తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా తన పెళ్లి గురించి స్పందిస్తూ తనకు పెళ్లి చేసేయాలని తన త‌ల్లిదండ్రులు ఎంతో ఆస‌క్తితో ఉన్నారని చెప్పింది.

అయితే, తాను దీనిపై ఆలోచించుకోవడానికి కాస్త స‌మయం కావాల‌ని అడిగానని, తనకు నచ్చిన వ్య‌క్తి దొరికిన‌ప్పుడు చేసుకుంటానని చెప్పింది. తనకు లవ్ మ్యారేజ్ పైనే ఆస‌క్తి ఉందని వివరించింది. కాగా, తొలుత షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రీతు అనంతరం 'బాద్‌ షా' సినిమాతో సినిమా కెరీర్ ప్రారంభించింది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'పెళ్లి చూపులు' సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ritu varma
Tollywood

More Telugu News