Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడ్ని అరెస్ట్ చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

High Court issues interim orders to not arrest Ayyanna
  • మహిళా అధికారిని దూషించారంటూ అయ్యన్నపై ఆరోపణ
  • హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన అయ్యన్న
  • హైకోర్టులో అయ్యన్నకు ఊరట
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్య పదజాలంతో దూషించాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండడంతో అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం అయ్యన్నను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Ayyanna Patrudu
AP High Court
Interim Orders
Telugudesam
YSRCP

More Telugu News