Devi Sri Prasad: ఇనుప డబ్బాలు, ప్లాస్టిక్ బాక్సులే డ్రమ్స్... ఇనుప రాడ్లే డ్రమ్ స్టిక్స్... దేవిశ్రీ నుంచి ఓ మ్యూజికల్ వీడియో

  • సంగీత పరికరాల్లేకుండానే దేవిశ్రీ గ్రూప్ మ్యూజిక్
  • తండ్రి, గురువుకు ఫాదర్స్ డే/మ్యూజిక్ డే నివాళిగా వీడియో 
  • ఒరిజనల్ ఇన్ స్ట్రుమెంట్స్ కు తీసిపోని రీతిలో దరువు
Devi Sri Prasad releases a video on Fathers Day

టాలీవుడ్, కోలీవుడ్ లో తనదైన బాణీలో స్వరాలు అందిస్తూ ట్రెండ్ కు తగ్గట్టుగా దూసుకెళుతున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఫాదర్స్ డే/మ్యూజిక్ డే సందర్భంగా ఓ మ్యూజికల్ వీడియో పంచుకున్నారు. ఈ వీడియోలో సంగీత వాయిద్య పరికరాలేవీ లేకుండానే దేవిశ్రీ గ్రూప్ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించడం చూడొచ్చు.

కేవలం ఇనుప డబ్బాలు, ప్లాస్టిక్ బాక్సులను ఉపయోగించి ఉర్రూతలూగించేలా దరువేశారు. ఒరిజినల్ ఇన్ స్ట్రుమెంట్స్ కు తీసిపోని రీతిలో ఎంతో హుషారుగా మోత మోగించారు. ఈ వీడియో గతంలో అమెరికాలో కచేరీ సందర్భంగా రికార్డు చేసినట్టు తెలుస్తోంది.

తాజాగా ఫాదర్స్ డేని పురస్కరించుకుని దేవిశ్రీ ప్రసాద్ తన తండ్రి సత్యమూర్తికి, మ్యూజిక్ డే సందర్భంగా తన సంగీత గురువు మాండొలిన్ శ్రీనివాస్ కు నివాళిగా ఈ వీడియోను రిలీజ్ చేశారు.

More Telugu News