Pattabhi Ram: విజయసాయి తన వియ్యంకుడికి 108 స్కాంలో కోట్లు దోచిపెట్టారు... ఆరెస్ట్ చేసే ధైర్యం ఉందా సీఎం గారూ?: పట్టాభిరామ్

  • 108 అంబులెన్స్ నిర్వహణలో దోచుకున్నారంటూ విమర్శలు
  •  అనుభవంలేని అరబిందో సంస్థకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపణ
  • అల్లుడికి ఇంకా కట్నకానుకులు పంపుతున్నారంటూ వ్యాఖ్యలు
TDP Leader Pattabhiram fires on VIjayasay Reddy and CM Jagan

టీడీపీ నేత పట్టాభిరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్ పైనా, ఇతర కీలక నేతలపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. మీ పార్టీ ముఖ్యనేత, మీ ఆత్మబంధువు విజయసాయిరెడ్డి 108 అంబులెన్స్ ల నిర్వహణ స్కాంలో వందల కోట్ల రూపాయలు దోచిపెట్టాడు, ఇప్పుడు పోలీసులతో గోడలు దూకించి అరెస్ట్ చేయించగలరా అంటూ పట్టాభిరామ్ సవాల్ విసిరారు. ఆ ధైర్యం ఉందా మీకు అంటూ సీఎం జగన్ ను నిలదీశాడు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చాక జీవీకే సంస్థ 108 అంబులెన్స్ ల నిర్వహణ కాంట్రాక్టు ముగియడంతో, 2016లో అత్యంత పారదర్శకంగా టెండర్లు పిలిచి ఆ కాంట్రాక్టు బీవీజీ సంస్థకు అప్పగించినట్టు వెల్లడించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏమాత్రం అనుభవంలేని అరబిందో ఫౌండేషన్ కు అంబులెన్స్ ల నిర్వహణ అప్పగించారని పట్టాభిరామ్ ఆరోపించారు. అనేక రాష్ట్రాల్లోనే కాకుండా, దేశ రాజధానిలో కూడా అంబులెన్స్ లు నిర్వహిస్తున్న బీవీజీ సంస్థను అడ్డగోలుగా పక్కనబెట్టేశారని మండిపడ్డారు.

అనుభవంలేని అరబిందో ఫౌండేషన్ ను తీసుకువచ్చి కొత్త అంబులెన్స్ కు అయితే నెలకు రూ.1,78,072, పాత అంబులెన్స్ అయితే నెలకు రూ.2,21,257 రేట్ల చొప్పున కట్టబెట్టారని ఆరోపించారు. గతంలో బీవీజీ సంస్థ ఎంతో తక్కువ నిర్వహణ వ్యయంతో 108 అంబులెన్స్ లు చేపట్టినట్టు వివరించారు.

"ఈ అరబిందో ఫౌండేషన్ ఎక్కడదని ఆరా తీస్తే, వైఎస్ జగన్ ఆత్మబంధువుగా పేర్కొన్న విజయసాయిరెడ్డికి స్వయానా వియ్యంకుడు పీవీ రాంప్రసాద్ రెడ్డికి చెందినదని తెలిసింది. నీ వియ్యంకుడు, నీ అల్లుడు రోహిత్ చెందిన సంస్థకు ఇంకా దోచిపెడుతున్నావా. పెళ్లి చేసి ఆరేడు సంవత్సరాలు అవుతున్నా, ఇంకా ఈ విధంగా కట్నకానుకలు పంపవుతున్నావా... సిగ్గుపడాలి విజయసాయిరెడ్డీ. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావా?" అంటూ మండిపడ్డారు.

More Telugu News