Chiranjeevi: చిరంజీవికి హెయిర్ కట్ చేసిన కుమార్తె... ఫాదర్స్ డే స్పెషల్ వీడియో

Susmitha cuts hair to his father Chiranjeevi
  • కుమార్తెతో హెయిర్ కట్ చేయించుకున్న చిరు
  • ఇంట్లోంచి బయటికి రాలేకపోతుంటే ఇంకేం చేయాలన్న సుస్మిత
  • మాకు మేమే సాయం చేసుకుంటున్నామన్న చిరంజీవి
ఇవాళ ఫాదర్స్ డే. చాలామంది సెలబ్రిటీలు తండ్రి విశిష్టత గురించి సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా ఫాదర్స్ డే స్పెషల్ అంటూ ఓ వీడియో పంచుకున్నారు. తన తండ్రి చిరంజీవికి తాను స్వయంగా హెయిర్ కట్ చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో చూడొచ్చు.

లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నాం... అందుకే మాకు మేమే ఇలా సాయం చేసుకుంటున్నాం అంటూ తండ్రీతనయ వ్యాఖ్యానించారు. థాంక్యూ నాన్నా. ఇప్పటివరకు ఎంతో ప్రేమను పంచావు. ఈ సాధారణ హెయిర్ కట్ నుంచి జీవితంలోని పెద్ద పెద్ద విషయాల వరకు ప్రతి దాంట్లో నాపై నమ్మకం ఉంచుతూ నాలో ఆత్మస్థైర్యాన్ని నింపావు. తండ్రి అంటే అదేనమో! హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా అంటూ సుస్మిత స్పందించారు.

Chiranjeevi
Susmitha
Hair Cut
Fathers Day
Video

More Telugu News