Raghurama Krishnamraju: పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు

MP Raghurama Krishnamraju complains to West Godavari SP
  • నరసాపురం ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు
  • తనను బెదిరిస్తున్నారన్న రఘురామకృష్ణంరాజు
  • రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి
నరసాపురం వైసీపీ రాజకీయాల్లో ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారలేదు. ఎంపీ రఘురామరాజుకు, వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్య ఇప్పటికీ మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని, తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పర్యటించే సమయంలో రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. అంతేకాదు, ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా నాలుగు స్టేషన్లకు చెందని ఎస్సైలు స్పందించలేదని, వారిపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం, ఆకివీడు పోలీస్ స్టేషన్లలో రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశానని, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని వెల్లడించారు.
Raghurama Krishnamraju
YSRCP
Narsapur
MLA
SP
West Godavari District

More Telugu News