New Delhi: ఆ ఘనత మోదీదే.. కేజ్రీ తన ఖాతాలో వేసుకుంటున్నారు: బీజేపీ

BJP Once again fires on Delhi cm kejriwal
  • కేంద్రం చొరవతోనే ఢిల్లీలో నివారణ చర్యలు మొదలు
  • మహమ్మారిపై ప్రజల్లో ఉన్న భయాలను తొలగించాం
  • ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ కుమార్ గుప్తా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ మరోమారు నిప్పులు చెరిగింది. ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం విశేష కృషి చేస్తుంటే, కేజ్రీవాల్ దానిని తన ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్ కుమార్ గుప్తా అన్నారు.

కేంద్ర ప్రభుత్వ జోక్యం తర్వాతే ఢిల్లీలో కరోనా నివారణ చర్యలు మొదలైనట్టు ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించగలిగామన్నారు. మోదీ చొరవతోనే తక్కువ ధరలో పరీక్షల సదుపాయం, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. అయితే, కేంద్ర ఘనతను కేజ్రీవాల్, ఆప్ ప్రభుత్వ మంత్రులు తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఆదేశ్ కుమార్ విమర్శించారు.

New Delhi
AAP
Adesh Kumar Gupta
BJP
Arvind Kejriwal

More Telugu News