Sushanth singh rajput: సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేక 13 ఏళ్ల బాలిక సహా ఇద్దరు ఆత్మహత్య

unable to digest Sushant death 13 year girl suicided
  • ఒడిశాలోని కటక్‌లో ఘటన
  • ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎనిమిదో తరగతి బాలిక
  • కార్యాలయంలో ఉరేసుకున్న 55 ఏళ్ల వ్యక్తి
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పెద్దలనే కాదు, చిన్నారులనూ బాధిస్తోంది. నటుడి మరణాన్ని తట్టుకోలేక ఒడిశాలోని కటక్‌లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 13 ఏళ్ల బాలిక ఉండడం గమనార్హం. నగరంలోని జోబ్రా ప్రాంతానికి చెందిన ఎనిమిదో తరగతి బాలిక సుశాంత్‌కు వీరాభామాని. సుశాంత్ మరణవార్తతో ఆమె కుంగిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుశాంత్‌కు తన కుమార్తె వీరాభిమాని అని, అతడి మరణాన్ని జీర్ణించుకోలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారు.

కటక్‌లోనే జరిగిన మరో ఘటనలో జగత్‌సింగ్‌పూర్‌కు చెందిన నిరంజన్‌రెడ్డి (55) తన కార్యాలయం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sushanth singh rajput
Bollywood
Odisha
cuttack
Suicide

More Telugu News