ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను మరోమారు అదుపులోకి తీసుకున్న అమెరికా
- ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష
- వారం రోజుల క్రితమే జైలు నుంచి విడుదల
- భారత్ విజ్ఞప్తితో జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే అరెస్ట్
తహవూర్‌ను తమకు అప్పగించాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన అమెరికా అతడు జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే లాస్ఏంజెలెస్ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. భారత్, అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల మేరకే అతడిని అరెస్ట్ చేసినట్టు అమెరికా అసిస్టెంట్ అటార్నీ జాన్ ఎల్ జూలెజియన్ పేర్కొన్నారు.
కాగా, ముంబై దాడుల ప్రధాన నిందితుడైన డేవిడ్ హెడ్లీకి తహవూర్ అత్యంత సన్నిహితుడు. దాడులకు ముందు రెక్కీ కూడా నిర్వహించాడు. 26 నవంబరు 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.