India: ఇండియాకు చెక్ పెట్టేందుకు చైనా కొత్త ప్లాన్... బంగ్లాదేశ్ కు భారీ తాయిలాలు!

  • 97 శాతం ప్రొడక్టులపై దిగుమతి సుంకాలు రద్దు
  • ఇటీవల సమావేశమైన జిన్ పింగ్, హసీనా
  • జూలై 1 నుంచి అమలులోకి రానున్న నిర్ణయం
China New Plan to Friendship Bangladesh to Check India

సరిహద్దుల్లో ఇండియాపై యుద్ధానికి కాలు దువ్వుతున్న చైనా, భారత్ కు ఇరుగు, పొరుగుగా ఉన్న దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే టిబెట్ పై పెత్తనాన్ని చెలాయిస్తూ, పాకిస్థాన్ కు దగ్గరైన చైనా, ఇప్పుడు బంగ్లాదేశ్ వైపు చూస్తోంది. బంగ్లాదేశ్ తో కూడా స్నేహ సంబంధాలు కావాలని కోరుకుంటూ భారీ తాయిలాలను ప్రకటించింది.

బంగ్లాదేశ్ నుంచి తాము దిగుమతి చేసుకున్న ప్రొడక్టుల్లో 97 శాతం ప్రొడక్టులకు పన్నుల నుంచి మినహాయింపును ప్రకటించింది. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకోవాలని ఇరు నేతలూ నిర్ణయించారు.

ఇక చైనా తీసుకున్న పన్ను మినహాయింపుల నిర్ణయంతో బంగ్లాదేశ్ కు చెందిన 8,256 ఉత్పత్తులపై పన్ను ఉండదు. ఇప్పటికే పలు రకాల బంగ్లా ఉత్పత్తులపై చైనాలో మినహాయింపులు ఉండగా, జూలై 1 నుంచి వీటి సంఖ్య 8,256కు చేరనుంది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పతనమైన బంగ్లాదేశ్, ఈ మినహాయింపులతో కాస్తంత పుంజుకుంటుందని అంచనా.

More Telugu News