Balakrishna: క్యాన్సర్ రోగుల సేవలో 20 ఏళ్లు... ఫౌండేషన్ లోగో విడుదల చేసిన బాలకృష్ణ

  • 2000 సంవత్సరంలో ప్రారంభమైన క్యాన్సర్ ఫౌండేషన్
  • ప్రారంభించిన అప్పటి ప్రధాని వాజ్ పేయి
  • లోగో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య అల్లుడు శ్రీభరత్
Nandamuri Balakrishna unveils cancer foundation logo

తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ బాధితులకు హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ అందించే సేవలు ఎనలేనివి. పేదలకు కూడా ఇక్కడ ఖరీదైన వైద్యం అందుబాటులో ఉంటుంది. ఈ ఇన్ స్టిట్యూట్ మాతృసంస్థ శ్రీమతి నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రత్యేక లోగా విడుదల చేశారు. క్యాన్సర్ రోగుల సేవలో రెండు దశాబ్దాలు గడిచినట్టుగా ఆ లోగోలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన ఆయన అల్లుడు శ్రీభరత్, మరో సభ్యుడు జేఎస్సార్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ వివరాలను బాలయ్య తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ఫౌండేషన్ ను 2000 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ప్రధాని వాజ్ పేయి చేతులమీదుగా ప్రారంభించారని వివరించారు. క్యాన్సర్ చికిత్సలో ఇన్నేళ్ల ప్రస్థానం నిస్సందేహంగా ఓ మైలురాయి అని పేర్కొన్నారు.

More Telugu News