Corona Virus: ఏపీలో కరోనా కల్లోలం... 24 గంటల్లో 491 మందికి పాజిటివ్

Corona virus spreading rapidly in AP
  • తాజాగా ఐదుగురి మృతి
  • 101కి పెరిగిన కరోనా మరణాలు
  • ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 8,452
లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల అనంతరం అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ఏపీలోనూ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. తాజాగా 491 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అంతేకాదు, గడచిన 24 గంటల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 101కి పెరిగింది.

ప్రస్తుతం ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,452గా నమోదైంది. ఈ కేసుల్లో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో కొత్తగా 83 కేసులు, విదేశాల నుంచి వచ్చినవారిలో 18 కేసులు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు 4,111 డిశ్చార్జి కాగా, 4,240 మంది చికిత్స పొందుతున్నారు.
Corona Virus
Andhra Pradesh
Positive
Deaths
COVID-19

More Telugu News