anasuya: ప్రతి రోజు ఓ గ్లాసు రెడ్ వైన్ తాగుతాను: యాంకర్ అనసూయ

anasuya about her red wine habit
  • ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అను
  • రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిది
  • ఆకలి ఉన్న సమయంలో నిద్ర పట్టదు 
  • దీంతో రాత్రి నిద్రపోయే ముందు రెడ్ వైన్ తాగుతా
తాను ప్రతిరోజు ఓ గ్లాస్ రెడ్ వైన్ తాగుతానని యాంకర్ అనసూయ తెలిపింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని చెప్పింది. అది గుండెకు చాలా మంచిదని వివరించింది. ఆకలిగా ఉన్న సమయంలో నిద్ర పట్టదని, దీంతో రాత్రి నిద్రపోయే ముందు తాను భోజనానికి బదులు రెడ్ వైన్ తాగుతానని చెప్పింది.

అయితే, ఇతరులందరికీ కూడా ఇలాగే  రెడ్‌ వైన్‌ తాగితే నిద్రపట్టే అవకాశాలున్నాయని చెప్పలేమని అను తెలిపింది. తనకు రెడ్‌ వైన్‌ బాగా పనిచేస్తోందని వివరించింది. కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగులు లేక ఇన్నిరోజులు ఇంట్లోనే ఉన్న అనసూయ ప్రస్తుతం మళ్లీ టీవీ కార్యక్రమాల షూటింగుల్లో బిజీ అయిపోయింది.
anasuya
Tollywood

More Telugu News