China: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: చైనాతో ఉద్రిక్తతలపై భారత వైమానిక దళ చీఫ్

  • మన శత్రువుకి నేను ఇచ్చే సందేశం ఏదీ లేదు
  • వారికి తెలుసు మన సామర్థ్యం ఏమిటో
  • చైనాతో యుద్ధం చేయాలని మేము కోరుకోవట్లేదు
  • ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉంది
We are not at war with China but prepared for any contingency

తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ వద్ద భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటోన్న నేపథ్యంలో భారత వైమానిక దళ చీఫ్ బధౌరియా కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు.

'మన శత్రువుకి నేను ఇచ్చే సందేశం ఏదీ లేదు. వారికి తెలుసు మన సామర్థ్యం ఏమిటో' అని చెప్పారు. చైనాతో యుద్ధం చేయాలని తాము కోరుకోవట్లేదని, అయితే, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. చైనాతో జరిగిన పోరాటంలో కల్నల్ సంతోష్ బృందం త్యాగం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఆ వీరుల త్యాగాలను వృథాకానివ్వబోమని అన్నారు.

భారత సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో వారు తమ సంకల్ప బలం ఏంటో చూపించారని బధౌరియా తెలిపారు.  ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. సరిహద్దుల వద్ద తాము అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. మన దేశ భద్రతా దళాల శక్తిసామర్థ్యాలపై ఏ విధమైన అనుమానాలు అవసరం లేదని, ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News