Jagan: మేం ప్రారంభించిన పథకాలు చూస్తుంటే నేనే ఆ పేర్లు మిస్ అవుతానేమో అనిపిస్తోంది: సీఎం జగన్

  • వైఎస్సార్ నేతన్న హస్తం నిధుల విడుదల
  • రెండో విడత ప్రారంభించిన సీఎం జగన్
  • కేవలం 13 నెలల వ్యవధిలోనే ఇవన్నీ చేశామని వెల్లడి
CM Jagan starts YSR Nethanna Nestam

ఏపీ సీఎం జగన్ ఇవాళ 'వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం' ప్రారంభించారు. సొంత మగ్గం కలిగి దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్న ప్రతి చేనేత కుటుంబానికి ఈ పథకం ద్వారా వరుసగా రెండో ఏడాది రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే బటన్ నొక్కి సీఎం జగన్ ఈ పథకం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వీడియో లింక్ ద్వారా లబ్దిదారులతో మాట్లాడారు. గతేడాది తన పుట్టినరోజు డిసెంబరు 21న 'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకాన్ని ప్రారంభించామని, రెండో విడత సాయాన్ని మళ్లీ అదే రోజున ఇద్దామనుకున్నా, కరోనా కష్టకాలంలో నేతన్నలు పడుతున్న కష్టం చూడలేక వారికి ముందుగానే సాయం విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు ఇలా అనేక విధాలుగా పేదలను ఆదుకుంటున్నామని తెలిపారు. "మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన పథకాలు చూస్తుంటే, వాటి పేర్లు నేనే మిస్సవుతానేమో అనిపిస్తోంది" అంటూ సీఎం జగన్ చమత్కరించారు. కేవలం 13 నెలల వ్యవధిలోనే ఇవన్నీ చేయగలిగామంటే అది ఆ దేవుడి దయ, మీ అందరి ఆశీస్సుల వల్లేనని సీఎం జగన్ వినమ్రంగా పేర్కొన్నారు.

More Telugu News