CPI Narayana: రాజ్ భవన్ ముట్టడికి బైక్ పై వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నారాయణ... అరెస్ట్ చేసిన పోలీసులు

Police arrests CPI Narayana after attempted to attack on Rajbhavan
  • దేశంలో పెట్రోల్ ధరలు పెంపు
  • నిరసనలకు పిలుపునిచ్చిన సీపీఐ
  • నారాయణను అడ్డుకుని పీఎస్ కు తరలించిన పోలీసులు
పెట్రోల్ ధరలను పెంచుతూ సీపీఐ నేడు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో రాజ్ భవన్ ముట్టడికి సీపీఐ కార్యకర్తలు ప్రయత్నించారు. ఆ పార్టీ అగ్రనేత నారాయణపై పోలీసులు నిఘా ఉంచగా, ఆయన వారి కళ్లు గప్పి బైక్ పై రాజ్ భవన్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయన రాకను పసిగట్టి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొన్నిరోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.
CPI Narayana
Rajbhavan
Police
Arrest
Petrol

More Telugu News