China: గాల్వాన్ ముమ్మాటికీ మాదే... వదిలేది లేదన్న చైనా!

  • చైనా పరిధిలోనే గాల్వాన్ లోయ
  • ఇండియా సైన్యం కావాలనే రెచ్చగొడుతోంది
  • చైనా అధికార ప్రతినిధి లిజియాన్
Another Comment on Galwan Vally by China

ఓ వైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ, మన పరిధిలోకి ఎవరూ రాలేదని, ఒక్క అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కాలేదని నిన్నటి అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేసిన వేళ, చైనా విదేశాంగ శాఖ మరోసారి స్పందించింది. భారత్ పై విషం కక్కుతూ, తన అక్కసును వెళ్లగక్కిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్, గాల్వాన్ లోయ తమదేనని మరోసారి వ్యాఖ్యానించి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఆ లోయ, నియంత్రణ రేఖ సమీపంలో చైనా వైపే ఉందని, అది తమదేనని, దాన్ని వదులుకునేది లేదని అన్నారు. భారత సైన్యం, తమ భూ భాగంలోకి అక్రమంగా చొరబడి, రోడ్లు, వంతెనలు నిర్మిస్తోందని ఆరోపించారు.

ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో చైనా పీపుల్స్ ఆర్మీ పెట్రోలింగ్ విధుల్లో ఉందని వ్యాఖ్యానించిన లిజియాన్, భారత సైన్యం, తమను ఏ మాత్రమూ సంప్రదించకుండా, రోడ్లను నిర్మిస్తోందని ఆయన అన్నారు. ఇక్కడ వంతెనలను వారు కట్టారని, ఇతర మౌలిక వసతులను కల్పించుకుంటున్నారని, చాలా సందర్భాల్లో వీటిని అడ్డుకునేందుకు తమ జవాన్లు ప్రయత్నించారని ఆయన అన్నారు. సరిహద్దులను ఇండియా జవాన్లే దాటుతూ, తమను కావాలని రెచ్చగొడుతున్నారని ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు.

  • Loading...

More Telugu News