Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ప్రముఖ తమిళ హీరో సరసన రష్మిక 
  • ఈ నెలలోనే ప్రభాస్ ఫస్ట్ లుక్
  • నితిన్ సినిమాలో సీనియర్ నటి
Rashmika to be cast opposite Vijay

*  ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలు చేస్తూ బిజీగా వున్న కథానాయిక రష్మిక త్వరలో తమిళ స్టార్ విజయ్ సరసన నటించే అవకాశం కనిపిస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందే చిత్రంలో కథానాయికగా రష్మికను ఎంపిక చేస్తున్నట్టు సమాచారం.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈ నెలలోనే రిలీజ్ చేస్తారట. ఎప్పుడు రిలీజ్ చేసేది త్వరలో ప్రకటిస్తారు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'రాధే శ్యామ్' అనే టైటిల్ని దాదాపు ఫైనల్ చేశారట.  
*  నితిన్ తన తదుపరి చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేయనున్నాడు. దీనికి 'పవర్ పేట'  అనే టైటిల్ని కూడా ఇంతకుముందే నిర్ణయించారు. ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సీనియర్ నటి నదియా నటిస్తుందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం నితిన్ 'రంగ్ దే' సినిమాలో నటిస్తున్నాడు.  

  • Loading...

More Telugu News