KCR: అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

CM KCR announces five crore rupees for Col Santosh Babu family
  • ఇటీవల సరిహద్దు ఘర్షణల్లో మృతి చెందిన కల్నల్ సంతోష్
  • సంతోష్ భార్యకు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామన్న సీఎం కేసీఆర్
  • స్వయంగా ఇంటికి వెళ్లి నగదు సాయం అందిస్తానని వెల్లడి
ఇటీవల చైనా బలగాలతో సరిహద్దు ఘర్షణల్లో అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.5 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. అంతేకాదు, సంతోష్ బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఇక, సంతోష్ బాబుతో పాటు ఆ ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి నగదు సాయం అందజేస్తానని తెలిపారు.
KCR
Col Santosh Babu
Mortyr
Galwan Valley
Ladakh
China

More Telugu News