Sensex: ఫైనాన్స్, ఎనర్జీ స్టాకుల అండతో వారాన్ని భారీ లాభాల్లో ముగించిన మార్కెట్లు

  • 523 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 153 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 7 శాతం వరకు పుంజుకున్న బజాజ్ ఫైనాన్స్
Sensex ends this week  with profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఫైనాన్సియల్, ఎనర్జీ స్టాకుల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మర్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈనాటి ఇంట్రాడేలో ప్రారంభంలో సూచీలు కొంచెం ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ...  11 గంటల నుంచి లాభాల్లో పయనించాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 523 పాయింట్లు లాభపడి 34,732కి పెరిగింది. నిఫ్టీ 153 పాయింట్లు పుంజుకుని 10,244 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:

బజాజ్ ఫైనాన్స్ (6.74%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (6.23%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.23%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.38%), మారుతి సుజుకి (3.19%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.94%), ఐటీసీ లిమిటెడ్ (-1.37%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.35%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.19%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.87%).

More Telugu News