దీనిపై దేశ ప్రజలంతా ప్రమాణం చేయాలి: చైనాతో ఉద్రిక్తతలపై కన్నా లక్ష్మీనారాయణ
- చైనా వస్తువులు కొనుగోలు చేయొద్దు
- చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలి
- అప్పుడే ఆ దేశానికి బుద్ధి వస్తుంది
- ఏడాది కాలంగా చైనా కవ్వింపు చర్యలు
చైనా దాడిలో అమరులైన సైనికులకు బీజేపీ ఏపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని చెప్పారు. చైనా సైనికులతో భారత సైనికులు పోరాడిన తీరును కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు. ఈ పోరులో 20 మంది భారత సైనికులు అమరులయ్యారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేశం మొత్తం కోరుకుంటుందని తెలిపారు.