Niharika: 'నా వాడే'... కాబోయే భర్త గురించి నీహారిక కామెంట్!

Niharika Says in Social Media that He is Mine
  • ఒక్కో సస్పెన్స్ నూ రివీల్ చేస్తున్న నీహారిక
  • తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో మరో పోస్ట్
  • చైతన్యతో కలిసున్న చిత్రాన్ని పోస్ట్ చేసిన మెగా డాటర్
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారికకు వివాహం నిశ్చయమైంది. ఇక ఆమె పెళ్లి ఎప్పుడన్న విషయమే ఖరారు కావాల్సి వుంది. నిన్న 'మిస్సెస్ నిహా' అంటూ తొలుత, ఆపై తన కాబోయే భర్త ముఖాన్ని కనిపించకుండా ఫోటో పెట్టిన ఆమె, ఆ తరువాత అతనెవరో రివీల్ చేసేసింది. తాజాగా, అతను తనవాడే (మైన్) అంటూ ఇన్ స్టాగ్రామ్ లో మరో పోస్ట్ పెట్టింది. కాగా, నీహారికకు కాబోయే భర్త పేరు జొన్నలగడ్డ వెంకట చైతన్యని, అతను గుంటూరు ఐజీ కుమారుడన్న సంగతి ఇప్పటికే బహిర్గతమైన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి నీహారిక, తన సామాజిక మాధ్యమాల ద్వారా ఒక్కో సస్పెన్స్ నూ రివీల్ చేస్తోంది.
Niharika
Venkata Chaitanya
Fiancy
Instagram

More Telugu News