Subrahmanya Swamy: కరోనాపై చైనాతో చర్చలకు విదేశాంగ మంత్రిని పంపకండి: సుబ్రహ్మణ్య స్వామి

  • భారత చర్యలు హాస్యాస్పదం
  • విదేశాంగ మంత్రిని అదుపులో పెట్టాలి
  • అతనికి బదులుగా ఆరోగ్య మంత్రిని పంపండి
  • ట్విట్టర్ లో సుబ్రహ్మణ్య స్వామి
Subrahmanya Swamy Commented it Rediculous to Talk with China

భారత విదేశాంగ మంత్రి, చైనా విదేశాంగ మంత్రితో కరోనా మహమ్మారిపై చర్చలు జరపాలని నిర్ణయించడాన్ని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తప్పుబట్టారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు.

"భారత విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రితో కరోనాపై చర్చలు జరపనుండటం హాస్యాస్పదం. విదేశాంగ మంత్రిని చర్చలకు వెళ్లద్దని ప్రధాని ఆదేశించాలి. లేదంటే ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ను పంపించాలి. ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఏంటంటే, ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి చైనా సైన్యం గాల్వాన్ లోయ నుంచి వెనక్కు మళ్లేలా చూడాలని ఆ దేశ అధ్యక్షుడు  జీ జిన్ పింగ్ ను డిమాండ్ చేయాలి" అని స్వామి వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెల 23న కరోనా మహమ్మారి విషయంపై చర్చించడానికి రష్యా, ఇండియా, చైనా దేశాల మధ్య త్రైపాక్షిక వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది.    

  • Loading...

More Telugu News